31.2 C
Hyderabad
Thursday, April 23, 2026
No menu items!

కథలాపూర్‌లో ఘనంగా చెల్మెడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు

(అల్లే సంతోష్, కథలాపూర్)

జగిత్యాల జిల్లా, కథలాపూర్ మండల కేంద్రంలో వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ చెల్మెడ లక్ష్మీనరసింహారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని కథలాపూర్ బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన వారిలో కథలాపూర్ మండల మాజీ ఎంపీటీసీ మామిడిపెల్లి రవి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం భూమారెడ్డి, అల్లె సంతోష్, నల్ల నిఖిల్, మైస శ్రీధర్, కే. జగదీష్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, టీ. జగదీష్, బి. గణేష్, అంగ స్వామి, మామిడిపెల్లి లోకేష్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల స్థాయి నాయకులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles