32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయండి: జువ్వాడి కృష్ణారావు వినతి

(బాలే అజయ్ – 9290277727 | కోరుట్ల)

కోరుట్ల నియోజకవర్గంలోని అయిలాపూర్‌లో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణంతో పాటు రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు, నియోజకవర్గంలోని ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామిని కోరారు.

ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోరుట్ల నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపై స్పందించిన మంత్రి వివేక్ వెంకటస్వామి, పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు జువ్వాడి కృష్ణారావు విలేకరులకు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి సహకరించి, సమస్యల పరిష్కారానికి స్పందించిన మంత్రికి ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles