(బాలే అజయ్ – 9290277727 | కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాలేజీ గ్రౌండ్లో అనాథగా మృతి చెందిన శ్రీరాముల లింబాద్రి మృతదేహానికి పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.
లింబాద్రి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జగిత్యాల జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ సంఘం నాయకులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, 32వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ జిందం లక్ష్మీనారాయణ, ఆడెపు నరేష్ తదితరులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ వసీం, మైనారిటీ సోదరులు అమీర్, సమీర్, గుద్దేటి విజయ్, సంకోజి రవి, శ్మశానవాటిక సిబ్బంది వీరభద్ర శ్రీనివాస్, లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అనాథగా మృతి చెందిన వ్యక్తికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్న సంఘం సభ్యులను పలువురు అభినందించారు.
