
(బాలే అజయ్ – 9290277727, జగిత్యాల)
జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల పోస్టర్ ఆవిష్కరణ
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. కమిటీ జాతీయ చైర్మన్, వ్యవస్థాపకులు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు జిల్లా బాడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ (AC–LB) బి. రాజగౌడ్ ను కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జగిత్యాల జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల పోస్టర్ను ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (DRO) కె. వై. ప్రసాద్ ను కమిటీ సభ్యులు సన్మానించారు. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే RTI సంబంధిత కమిటీలలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీకి చెందిన కొంతమంది సభ్యులకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (MRO) కిషన్ ను కూడా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు వోడ్నాల రామారావు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం (RTI) ప్రతి సామాన్య పౌరుడికి కల్పించిన హక్కు అని అన్నారు. ఈ చట్టాన్ని ప్రజలు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వివిధ సమస్యలు, ప్రభుత్వ సమాచారం, ప్రజలకు అవసరమైన వివరాలను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకువస్తే, కమిటీ తరఫున సంబంధిత అధికారులకు లేఖలు అందజేసి, సమస్యల పరిష్కారం కోసం చట్టపరమైన మార్గాల్లో కృషి చేస్తామని తెలిపారు.
అతి త్వరలోనే జగిత్యాల జిల్లా, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిలో కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి, ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై మరింత అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని వోడ్నాల రామారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల సభ్యులు చిప్ప నిరంజన్, గట్ల ప్రకాష్, చింత సూర్యనారాయణ ప్రసాద్, బద్రి సృజన్, పులి అనిల్, వాసాల నరేందర్, కస్తూరి వెంకటరమణ, తుమ్మ సురేష్, పల్లికొండ సంతోష్ కుమార్, అడ్లగట్ల సత్యనారాయణ, గెట్టి రమేష్, కంది చంద్రశేఖర్ రావు, అబ్బూరి రాజనర్సయ్య, బుర్ర నాగరాజ్, కోటగిరి రాజేశ్వర్, జుగ్గే వినయ్, సయ్యద్ జాంగీర్, బాలే అజయ్, అడ్లగట్ల సురేష్, కైలాస సాయికృష్ణ, గట్ల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
