32 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

మానసిక అనారోగ్యంతో మహిళ బావిలో పడి మృతి

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధ మహిళ వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్‌రావుపేట గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మోహన్‌రావుపేట గ్రామానికి చెందిన గుండె గంగు (75), భర్త ఎర్రన్న గత నాలుగు నెలలుగా ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయినప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడంతో అప్పుడప్పుడు కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేది.

ఈ క్రమంలో అక్టోబర్ 1న ఉదయం సుమారు 7:40 గంటలకు గుండె గంగు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతుకుతుండగా, ఆమె వ్యవసాయ భూమి వైపు వెళ్లినట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె కుమారుడు గుండె శ్రీనివాస్ (46) పొలానికి వెళ్లి చూడగా, వ్యవసాయ బావిలో గుండె గంగు మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది.

ఈ ఘటనపై శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలి మరణంపై కుటుంబ సభ్యులకు ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles