
(బాలే అజయ్, కోరుట్ల, 9290277727)
పట్టణంలోని పటేల్ రోడ్డు కాలువ గడ్డ చౌరస్తా వద్ద గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు వృధాగా పోతున్న పట్టించుకునే నాధుడు లేడని స్థానికులు వాపోతున్నారు.
దీంతోపాటు పట్టణంలో పలుచోట్ల మిషన్ భగీరథ నీరు ఇంటి యజమానులు కూడా కనీసం నల్లాలను బిగించుకోక అశ్రద్ధ వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
మున్సిపల్ అధికారులు నీటి విషయంలో సరియైన జాగ్రత్తలు పాటించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని, అదేవిధంగా పలుచోట్ల వృధాగా పోతున్న నీటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
