23.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
No menu items!

పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట: కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వీ. రాఘవేంద్ర

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వీ. రాఘవేంద్ర పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని 2వ వార్డులో చేపట్టిన పారిశుద్ధ్య పనులు, డ్రై డే కార్యక్రమం, యాంటీ లార్వా నివారణ చర్యలను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఇంట్లో పాత టైర్లు, కూలర్లు, కొబ్బరి చిప్పలు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో యాంటీ లార్వా స్ప్రేలు పిచికారీ చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ వేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

అలాగే ప్రతి రోజు డ్రై డే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పారిశుద్ధ్యంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోనే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నివారించవచ్చని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, అశోక్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles