(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
ఎస్ఐఆర్ (SIR) దరఖాస్తులు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు కోరుట్ల పట్టణంలోని 7వ వార్డు అర్బన్ కాలనీ కమిటీ హాల్లో గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన ఈ హెల్ప్‌డెస్క్‌లో ఎస్ఐఆర్ దరఖాస్తుల నమోదు, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడం, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం, దరఖాస్తు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం వంటి సేవలు అందించారు.
ఈ హెల్ప్‌డెస్క్‌ను 7వ వార్డు కౌన్సిలర్లు గూగులోత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని గుద్దేటి రాజేందర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కృష్ణ చైతన్య, హెల్ప్‌డెస్క్‌ను సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. దరఖాస్తుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఆర్పీ నిజామాబాద్ రూప, ఎం.డి. జాఫర్ అహ్మద్, ఆకుల సుజాత, పత్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
