(బాలే అజయ్, కోరుట్ల)
పట్టణంలోని సినారే కళాభవనంలో సోమవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో వసంతకవి సమ్మేళనం జరిగింది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న కవులు తమ కవితలను వినిపింపించి ప్రేక్షకులను ఆనంద బరితులను చేసారు.
సుమారు 40 మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతి సాహిత్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కవి సమ్మేళనానికి తత్వాది కృష్ణ శర్మ అధ్యక్షత వహించగా బట్టు హరికృష్ణ కవులను పరిచయం చేస్తూ సన్మానం చేశారు. అందే రాజేంద్ర, అందే శివప్రసాద్, రాజు జి భూమేశ్వర్, వనపర్తి చంద్రమోహన్, గజల్ రాజేంద్రప్రసాద్, జమన్ జ్యోతి శ్రీనివాస్ చిలుక రాజలింగం, సుధాకర్, కటుకం కవిత తదితరులు పాల్గొన్నారు
