(తెలంగాణ సామ్నా డెస్క్)
మొట్టమొదటిసారిగా కరీంనగరం కార్పొరేషన్ బిజెపి వశం కానుంది. శనివారం మరో ఇద్దరు కార్పోరేటర్లు బిజెపిలో చేరడంతో కరీంనగర్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగురుతోందని పార్టీ కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అలాగే ఒక స్వతంత్ర అభ్యర్థితో పాటుగా శనివారం మరో ఇద్దరూ చేరడంతో బండి సంజయ్ ఎక్స్ అఫీషియ ఓటు తో పాటు బిజెపి బలం 35కు చేరింది. దీనితో మేయర్ పీఠం బిజెపి వశం కాబోతోంది. కరీంనగర్ బిజెపి వశం కానుండడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
