29.1 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మహిళా వైద్యురాలికి ఘన సన్మానం

(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)

జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం ఫిబ్రవరి 3 మంగళవారం సందర్భంగా మహిళా వైద్యుల సేవలను గుర్తిస్తూ, బుధవారం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న మహిళా వైద్యురాలు డాక్టర్ బట్టు శిల్పను వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్, కోరుట్ల ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఒక మహిళ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అదే సమయంలో వైద్యురాలిగా ప్రజలకు సేవలందించడం ఎంతో అభినందనీయమని అన్నారు. పిల్లల సంరక్షణతో పాటు భర్తతో సమన్వయం చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ, వైద్య వృత్తిలో అంకితభావంతో సేవలందిస్తున్న మహిళా వైద్యుల సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు కొత్త గణేష్, కార్యదర్శి బొడ్ల ఆంజనేయులు, కోశాధికారి శక్కరి వెంకటేశ్వర్, జోనల్ చైర్మన్ నీలి శ్రీనివాస్, అనంతుల రవళి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles