(నిన్నటి తరువాయి)
- సంప్రదాయబద్ధమైన బ్రహ్మణ కుటుంబములో జన్మించినందున సహజముగనే హిందూ ధర్మము, హిందూ చరిత్ర, హిందూ సంస్కృతుల యెడ గౌరవభావము పెంపొందించుకొనినాను. హిందూ భావనతో కూడిన వాటన్నింటిని గూర్చి నేను అత్యంత గ్వభావము కలిగిఉండేవాడిని.ఇట్లయినప్పటికీ నేను పెద్దవాడినయ్యే కొద్ది ఏవో రాజకీయ లేక మతపరమైన ‘తత్వము’ అను శిరసావహించే మూఢ నమ్మకములచే బద్దము కాని స్వేచ్చతో కూడిన ఆలోచనా విధానమును పెంపొందించుకో సాగినాను. అందువలననే పుట్టుక మీద ఆధారపడిన కులవ్యవస్థను, ఆస్పృశ్యతను నిర్మూలించుటకు తీవ్రముగ కృషి చేసినాను. హిందువులందరికి మతపరంగాను, సమాజపరంగాను ఒకే అంతస్తు వుండవలెననీ, గొప్ప తక్కువలనునవి వారి వారి సమర్ధత మీద ఆధారపడవలెనేగాని, ఒక కులము లోనో, ఒక వృత్తిలోనో జన్నిమచుటవలన ఏర్పడరాదని నమ్మిన నేను కుల వ్యతిరేక వుద్యమమములో బహిరంగముగ చేరినాను. వేలకొలది హిందువులు బ్రహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, చమార్లు, భంగీలు, కుల పద్ధతులను బద్దలు కొట్టి ఒకే పంక్తిలో భోజనము చేయు కుల వ్యతిరేక సమాజాలలో నేను బహిరంగముగ పాల్గొనుచుండెడివాడను.
- భారతదేశం ఇంకా ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా, రష్యా వంటి ప్రముఖ దేశముల పురాతన, బుూధునాతన చరిత్రలతోబాటు దాదాబాయినౌరోజీ, వివేకానంద, గోఖలే, తిలక్‌ల రచనలను నేను చదివినాను. వాటిని మాత్రమే కాదు ఇంకా సామ్యవాదము, కమ్యూనిజముల సిద్ధాంతములను చెప్పుకోదగిన మేరకు ఆధ్యయనము చేసినాను. వీటన్నింటిని మించి వీరసావర్కరు, గాంధీజీ రచనలను, ఉ9పన్యాసములను క్షుణ్ణముగా ఆద్యయనము చేసినాను. ఎందువల్లనంటే, గత యాబై సంవత్సరములలో ఏ ఒక్క కారణము చేయనంతగా ఈ రెండు విచార ధోరణులు ఆధునిక భారతీయ ఆలోచన, కార్యకరణులను రూపొందించుటకు దోమదము చేసినవి.
28.ఈ ఆధ్యయనము, తత్వచింతనము వలన ఒక దేశభక్తుడుగా, ఒక మానవతావాదిగా హిందూజాతిని హిందూ ప్రజలను సేవించుట అన్నింటిని మించిన నా ప్రథమ కర్తవ్యమనే దృఢవిశ్వాసము నాకు కల్గినది. ఎందువ్లనంటే ముప్పయికపోట్ల హిందువుల స్వాతంత్య్రన్ని సాధించి వారి న్యాయమైన హక్కులను పరిరక్షించుట ప్రపంచంలోని ఆయిదవ వంతు మానవజాతి యొక్క స్వాతంత్య్ర సంక్షేమముల సాధించుటే కదా! ఆ విశ్వాసమే, మా మాతృదేశమునకు స్వాతంత్య్రము సాధించి, ఆమె మానవ జాతికంతకు నిజమైన సేవ చేయగల్గునట్లు చేయగలదని నేను నమ్మిన హిందూ సంఘటనావాదమునకు, ఆ కార్యకలాపములకు నన్ను నేను అంకితము చేసుకొనునట్లు చేసినది.
(తరావాయి రేపు)

