(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలోని 7వ వార్డు పరిధిలో గల అర్బన్ కాలనీకి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరారు. ఈ మేరకు కోరుట్ల డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, అర్బన్ కాలనీ నుంచి ప్రతిరోజూ సుమారు 60 నుంచి 70 మంది విద్యార్థులు కల్లూరు మోడల్ స్కూల్‌తో పాటు కల్లూరు రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలకు ఆటోల ద్వారా ప్రయాణిస్తున్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రస్తుతం సమీపంలోని 23వ వార్డులో ఉన్న యెస్కోన్‌గుట్ట వరకు ఆర్టీసీ బస్సు నడుస్తోందని, అదే బస్సును అర్బన్ కాలనీ మీదుగా మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అర్బన్ కాలనీకి బస్సు సౌకర్యం కల్పించాలని 7వ వార్డు కౌన్సిలర్ గుగులావత్ శ్రీకాంత్, గుద్దేటి రాజేందర్‌తో పాటు కాలనీ వాసులు డిపో మేనేజర్‌ను విజ్ఞప్తి చేశారు.
