దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ రాజన్న ఆలయానికి శ్రావణమాస సందడి నెలకొంది. శ్రావణమాస ఆదివారం రోజున అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా భక్తులు రాజన్నను విపరీతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా భక్తులతో వేములవాడ పోటెత్తింది. రాజన్నను దర్శించుకునే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కోడెమోక్కులు చెల్లిస్తారు. భక్తులు లఘు దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు
