
రాష్ట్ర అధ్యక్షుడు రేసులో బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ ముందున్నట్టుగా సమాచారం అందుతుంది. తాను రాష్ట్ర అధ్యక్షుడు రేసులో లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలపడంతో ఈటెలపై అంచనాలు పెరిగాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఈటలకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్కు బారాస దూకుడుకు బ్రేక్ వేయటానికి ఈటెల సరైన వ్యక్తి అనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్టుగా కార్యకర్తల నుండి సమాచారం అందుతుంది. అయితే ఈటెల తో పాటుగా డీకే అరుణ రఘునందన్ రావు ల పేర్లను కూడా కేంద్ర అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
