37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం ‘‘గాంధీ హత్య’’

(నిన్నటి తరువాయి)

సిద్ధాంతపరంగా నేను సంయుక్త నియోజక వర్గములకై వాదించినప్పటికి ముస్లింలు పట్టుబట్టుట వలన తాత్కాలికముగ ప్రత్యేక నియోజక వర్గములను ప్రవేశపెట్టు విషయములో మనసును సరిపెట్టుకో గల్గినాను. కాని ప్రతి వర్గమునకు వారి జనాభా ప్రాతిపదికగా వారి ప్రతినిధుల సంఖ్య నిర్ణయింపవలెనని పట్టుబట్టినాను. ఆ సిద్ధాంతమునకు నేను ఎల్లప్పుడు కట్టుబడియుండినాను.

బ్రిటిషు యజమాఉలు అంతర్గతగా రేకెత్తించించిన ఆకాంక్షలతో ఒకవైపు, గాంధజీ నాయకత్తంలో కాంగ్రెసు ఇచ్చిన ప్రోత్సాహంతో మరియొక వైపు. ముస్లింలీగు వర్గపరంగా తన కోరికలను పనెంచుకొంటూ పోసాగింది. ముస్లింవర్గము ఎల్లప్పుడు ముస్లింలీగునే బలపరచసాగింది. జరిగిన ప్రతి ఎన్నికలలోను పూర్తిగా వినియోగపరచుకొన్నది. ఈ విధంగా ప్రోత్సతహింపబడిన ముస్లింలీగు తన వేర్పాటు ధోరణులను సంవత్సరము తర్వాత సంవత్సరము వృద్ధి చేసుకొంటూ పోసాగినది.

పైన నేను చెప్పిన విధంగా, ప్రత్యేక నియోజక వర్గములకు తన ఆక్షేపణ వున్నప్పటికి, మొదటి 1916 సంవత్సరపు లక్నో ఒ ప్పందం ద్వారా, తర్వాత ప్రతి రాజ్యాంగ మార్పు సందర్భములోను, న్యాయరహితమైన ముస్లింలీగు కోర్కెలన్నిటికి కాంగ్రెసు సమ్మతించసాగింది. తర్వాత ఫలితమును గమనించినప్పుడు, కాంగ్రెసు జాతీయ ప్రజాస్వామ్య పథముల నుండి తపిÊంనందున ఎంత భరించరాని విపత్తు మూడినది తేటతెల్లము కాగలదు.

1920 సంత్సరము నుండి, అనగా లోకమాన్య తిలక్‌ మరణించిన తర్వాత కాంగ్రెసులో గాంధీజీ పలుకుబడి వృద్ధి పొందుచూ తుదకు అడ్డులేని ప్రాధాన్యతను సంతరించుకొన్నది. ప్రజలను చైతన్యవంతము చేయుటలో ఆయన ఆర్భాటముగా దేశము ముందు పూరేగించిన సత్యము, అహింస అఉ నినాదములు, మరింత శక్తివంతము చేసినవి. జ్ఞాన వివేకులు గల ఏ వ్యక్తి ఈ నినాదములను తప్పుబట్టలేదు. నిజానికి వానిలో కొత్తదనము గాని, కొత్తగా కనిపెట్టినదిగాని ఏమీ లేదు. చట్టసమ్మతమైన ప్రతి ప్రజా ఉద్యమమములోనూ, అవి అంతరÊఈలనముగా వుండనే వున్నవి. మానవాళిలో అధిక భాగము ఈ ఉన్నత సిద్ధాంతాలను తమ రైనిందిన జీవితాలలో ఆచరించగలరని ఊహించడం పగటి కలలను కనడము మాత్రమే. నిజానికి తన ఆత్మీయుల, దేశము యొక్క గౌరవము విధ్యుక్తధర్మము, ప్రేమ తరుచుగా ఈ ఆహింసను త్యజించుటకుమనలను ప్రేరేపించనైనా ఊహించలేదు. అటువంటి శత్రువును ఎదిరించి వీలైతే అతనిని లొంగదీయడం మతపరమైన నైతికమైన ధర్మముగా నేను భావిస్తాను.

శ్రీరామచంద్రుడు ఘోర సంగ్రామంలో రావఘుని సంహరించి సీతకు విముక్తి కల్గించినాడు. కంసుని దుర్మార్గములను అంతము చేయటకు శ్రీకృష్ణుడు అతనిని సంహరించినాడు. మహాభారతములో అర్జునుడు అనేక మంది మిత్రులను, బంధువులను భీష్మునితో సహ దురాక్రమణదారుల వైపున వున్నందున నిర్జించి సంహరించినాడు. రాముని, కృష్ణుని, ఆర్జునుని హింసాచర్యలు చేసినారని అభివర్ణించడం మానవ క్రియాశక్తికి మూల ప్రేరణను గూర్తిచన ఆజ్ఞానమేనని నా ధృడ విశ్వాసము. ఛత్రపతి శివాజీ మహారాజు ప్రథమంలో నొనచ్చిన వీరోచిత పోరాటమే తుదకు భారతదేశములో ముస్లిం దుష్టపాలనను ధ్వసంము చేయగల్గింది. ఆఫ్జల్‌ఖాన్‌ను చంపడంలో శివాజీ ఎత్తుగడ పూర్తిగాసరి అయినదే . అట్ట చేయని యెడల అతడు శివాజీని తప్పక చంపి వుండేవాడు. శివాజీ, రాణాప్రతాప్‌, గురుగోవింద సింగులను తప్పుద్రోవలో పోయిన ధేశభక్తులుగా వర్ణించడంలో గాంధీజీ తన ఆత్మవంచననే బయటపెట్టుకొనినాడు.
(ఇంకా వుంది)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles