
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జలశక్తి అభియాన్ 3.0 కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ‘క్యాచ్ ది రైన్’ ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత, మున్సిపల్ కమిషనర్ వి. రాఘవేంద్ర నేతృత్వంలో అధికారులు, సిబ్బంది నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, సుస్థిర జల నిర్వహణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ తిరుమల వసంత, కమిషనర్ వి. రాఘవేంద్ర మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాల పెంపుదలకు సహకరించాలని, నీటి వృథాను పూర్తిగా నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
