(బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల మునిసిపాలిటీలో భారతీయ జనతా పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్‌గా రుద్ర సుజాతను, పార్టీ విప్‌గా కలాల సాయి చంద్ రాధను, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఇందూరి తిరుమల వాసును, సెక్రటరీగా గూగులోతి శ్రీకాంత్‌ను నియమించినట్లు రాంచంద్రరావు వెల్లడించారు.
ఈ నియామకాలకు సహకరించిన ధర్మపురి అర్వింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మి నారాయణలకు నూతనంగా నియమితులైన నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన వారిని డాక్టర్ అనూప్ రావు శాలువాతో సత్కరించి అభినందించారు.
