

(తెలంగాణ సామ్నా డెస్క్, కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా పెరిగింది.
పట్టణంలో ఉన్న రెండు పెట్రోల్ బంకులు వ్యాపార నిర్వహణ తదితర సంబంధిత వివాదాల వల్ల బంద్ చేసినట్లు తెలుస్తోంది. పట్టణ అవసరాలకు గాను పట్టణంలో రెండు బంకులు, శివారులో మూడు బంకులు ఉన్నాయి.
పట్టణ శివారులో ఉన్న పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఎప్పుడూ దొరుకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అని వాహనదారులు వాపోతున్నారు.
పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేని పరిస్థితుల్లో వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
డీసెల్ సరఫరా ఆశించినంతగా లేని కారణంగా పురపాలక సంఘం చెత్త తీసుకువెళ్ళే వాహనాలు కూడా తిరగడం లేదన్న సమాచారం వస్తున్నది. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.
