
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మహమ్మద్ షాహెద్ ఉల్ అహద్, వార్డు కౌన్సిలర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, అహింసా మార్గంలో స్వాతంత్ర్య సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలు, సత్యం, అహింస, శాంతి మార్గాలు సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పట్టణ నాయకులు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, పుర ప్రముఖులు తదితరులు పాల్గొని బాపూజీకి నివాళులర్పించారు.
