(తెలంగాణ సామ్నా డెస్క్)
సోమవారం రోజు నుండి సోషల్ మీడియాలో ఒక ప్రకటన విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం మూడు నెలల జైలు శిక్ష మరియు రూపాయలు ఐదువేల జరిమానా అని ఒక ఫంక్షన్ హాల్ యాజమాన్యం బోర్డు పెట్టినట్టుగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఇమేజ్ పట్ల చాలామంది చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇంతవరకు ఏ ఫంక్షన్ హాల్ ముందు కూడా కనిపించని ఇలాంటి ప్రకటన కొత్తగా వైరల్ కావడంతో అసలు బిఎన్ఎస్ 44 అంటే ఏమిటి తెలుసుకోవాలని ఉత్సాహం చాలామందిలో కనిపిస్తోంది.
అయితే బిఎన్ఎస్ 441 అంటే క్రిమినల్ రెస్పాస్ గురించి సంబంధించిన సెక్షన్ గా తెలుస్తుంది. ఈ సెక్షన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక వ్యక్తి లేదా ఒక సమూహం ఇతరులకు సంబంధించిన స్థలాల్లోకి గాని ఇంటిలోకి గాని ఆస్తిలోకి గాని ఇలాంటి అనుమతి లేకుండా ప్రవేశించడం లేదా హాని చేయడం లేదా బెదిరించడం లేదా ఇబ్బంది పెట్టడం లాంటి వాటికి ఈ సెక్షన్ ఉపయోగిస్తారు. అంటే ఒకరి ప్రైవేటు స్థలాల్లోకి అనుమతి లేకుండా వెళ్లడం అల్లరి చేయడం ఇలాంటివన్నీ ఈ సెక్షన్ కిందికి వస్తాయన్నమాట.
ఈ సెక్షన్ కింద నమోదైన కేసులకు జైలు శిక్ష గాని లేదా జరిమానా గాని లేదా రెండు కలిపి వేసే అవకాశం కోర్టుకు ఉంటుంది.
ఇంతవరకు ఫంక్షన్ హాల్ అంటేనే చుట్టుపక్కల వాళ్ళందరికీ పండుగలాగా కనిపించే ఒక వాతావరణం కొన్నిచోట్ల ఉండేది. ఈ సెక్షన్ ఇప్పుడు బయటకు రావడం వల్ల అలాంటివారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో అన్న చురకలు కొందరు వేస్తున్నారు
