37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

అందరికి క్లీన్‌చిట్..



(తెలంగాణ సామ్నా డెస్క్)

రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సంచలనం రేపిన 10మంది బి.ఆరఎస్ ఎమ్మేల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో వున్న అందరికి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లిన్‌చిట్ ఇచ్చేశారు. గతంలో ఎనిమిది మంది ఎమ్మేల్యేలకు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని కొట్టివేయగా తాజాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు కూడా పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని వారిపై బి.ఆర్.ఎస్ వేసిన పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దీనితో మొత్తంగా పదిమంది బి.ఆర్.ఎస్ ఎమ్మేల్యేలు చట్టప్రకారం అనర్హత కాకుండా కడిగిన ముత్యంలా బయటకు వచ్చేశారు.
మొదట్లో ఎనిమిది మందిపై ఖచ్చితత్వంతో కూడిన ఆధారాలు లేవని అందుకే వారందరు ఏమీ తప్పు చేయలేదని స్పీకర్ భావించివుండవచ్చు అనే చర్చ వచ్చింది. వారు వేసుకున్న కండావాలు దేశభక్తి పూరితమైన జాతీయ రంగులకు సంబంధించినవే కాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి కావని, అలాగే నియోజకవర్గ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రిని కలిశారని ఆ ఎనిమిది ఎమ్యేల్యేలు చెప్పిన విషయాన్ని స్పీకర్ ద్రువీకరించుకొని వారు పార్టీ ఫిరాయించలేదని వారు అనర్హత కేసుకు అనర్హులు అని తేల్చేశారు.

అయితే కడియం శ్రీహరి దానం నాగేందర్‌లు ప్రజల ముందు, పార్టీ సమావేశాల్లో బహిరంగంగా కనిపించడమే కాకుడం నాగేందర్ ఏకంగా ఎంపిగా పోటీ చేశారు. అయితే వీటన్నింటిని లెక్కలోకి తీసుకోన్నా స్పీకర్ తాజాగా వారిద్దరిని కూడా అనర్హతకు అర్హులు కారు అని వారిపై అభియోగాలను కొట్టివేశారు.

గురువారం సుప్రీంకోర్టులో ఎమ్మేల్యేలపై విచారణ జరుగనున్నట్లు సమాచారం. ఆ విచారణలో స్పీకర్ నిర్ణయం ముఖ్యమైన ఆంశం అయ్యే అవకాశం వున్న నేపథ్యంలో స్పీకర్ బుధవారం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. కడియం శ్రీహరి విషయంలో కొంత ఉదారవాదాన్ని స్పీకర్ చూపెట్టినా, దానం నాగేంధర్‌కు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం మటుకు వివాదస్పదంగా మారిందనే వాదన వస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బి.ఆర్.ఎస్ కోర్టును ఆశ్రయించే అవకాశాలు వున్నాయని ఆ పార్టీ శ్రేణుల చెబుతున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles