23.8 C
Hyderabad
Saturday, October 31, 2026
No menu items!

వాంగ్ములం

(నిన్నటి తరువాయి)
పదిహేడు సంవత్సరముల జైలు జీవితము తర్వాత విడుదలకు సంతోషమును వెలిబుచ్చుటకు తమ స్నేహితులు, శ్రేయోభిలాషులు ఏర్పాటు చేసిన స్వాగతోత్సవములులో గోపాల్‌కృష్ణ గోడ్సే, శ్రీవిష్ణుకర్కారే పాల్గొనినారు. ప్రభుత్వము ఉత్సవానిఇjక ఆగ్రహించింది. డిటెన్షన్‌ చట్టమును ఉపయోగించి వారు విడుదలైన నలబైరోజులలోనే మరల నిర్భందము వారిద్దరిని కటకటాల వెనుకకు త్రోసివేసినది.
వారిపై ఎలాంటి నేరము మోపబడలేదు. నిర్భందించు అధికారులు నిర్భందమనుకు గల ఆధారముల వషయములో తృప్తి చెందినారా లేదా అను విషయములో తప్ప హైకోర్టుకు జోక్యము కలిగించకొను అవకాశము లేదు. తిరిగి ప్రారంభమైన ఈ వేధింపు ఒక సంవత్సరము ఆరు నెలల తర్వాత పూర్తి అయినది.
ఆ తరువాత గోపాల్‌గోడ్సే పుస్తక రచన ప్రారంభింఇచానడు. ఈతను మరాఠీలో ఈ ఉదంతము మీదనే రచించిన ‘‘గాంధీ హత్య ఆణి మీ’’ అనునది మొదటి పుస్తకము.
ఇతర విషయములతోపాటు ఈ పుస్తకము ప్రభుత్వమును, దాని అసత్యములను బహిరంగపరచినది. అందువలన ప్రభుత్వము ఈసారి పుస్తకమును నిషేధించినది.
హైకోర్టు నిషేధమును తొలగించి వ్యాజ్యపు ఖర్చుల క్రింద ప్రభుత్వము రూ. 3000లు చెల్లించునట్లు ఉత్తర్వు చేసినది.
తర్వాత ఈ పుస్తకము మరల ముద్రింపబడుటయే కాగా ఇతర ప్రాంతీయ భాషలలోనికి కూడాప అనువదింపబడినది.
గోపాల్‌గోడ్సే మరికొన్ని పుస్తకములను కూడా వ్రాసినాడు. నాథురామ్‌ గోడ్సే ప్రకటన ఇతనిచే ప్రాంతీయ భాషలలో ప్రచురింపబడినవి.
ఆయన ‘‘వితస్థప్రకాశ్‌’’ అనే ప్రనచురణ సంస్థకు యజమాని (వితస్థ అనునది కాశ్మీరు గుండా ప్రవహించు జీలం నదికి వేదములలో ఇవ్వబడిన పేరు) ఆయన తన కుటుంబముతో పూణేలో నివసించుచున్నారు.
విష్ణుకర్కారే 1974 ఏప్రిల్‌ 6వ తేదీన నగుండెపోటుతో మరనించునంత వరకు ఆహమ్మద్‌నగర్‌ లో వ్యాపారము కొనసాగించినాడు. ఆయన మరణానంతరము ఆయన భార్య ఆ వ్యాపారమును చూస్తూ వున్నది.
మదన్‌లాల్‌పహ్వ, విడుదల తర్వాత వివాహము చేసుకొని బొంబాయిలో కొన్ని కాగితపు మిల్లుల కొనుగోలు అమ్మకములను నిర్వహించుచున్నాడు.
వీరసావర్కర్‌ 1966 ఫిబ్రవరి 22వ తేదీన బొంబాయిలో మరణించినాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే అటు బ్రిటిష్‌ పరిపాలనలోను ఇటు స్వాతంత్య్ర భారతంలోను ఆయన నిర్భంధంలో ఉండవలసి వచ్చినది. ఆయన చేసిన నేరమల్లా హిందువుల న్యాయసమ్మతమైన హక్కులను రోఇంచుటకు దేవవిభజన నిరోధించుటకు ప్రయత్నించడమే.

(తరువాయి బాగం రేపు)
ధృవీకరణ

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles