జన్వాడ ఫామ్ హౌస్ లో కొందరు వీఐపీల రేవ్ పార్టీని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసినట్టు సమాచారం. భారీ ఎత్తున డిజె సౌండ్స్ తో హోరెత్తించిన ఆ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా భారీగా విదేశీ మద్యం డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న సమాచారం వస్తుంది. ఈ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు కూడా చేయిస్తున్నట్టు సమాచారం. ఈ పార్టీలో పాల్గొన్న ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఆ మాజీ మంత్రి బావమరిది పై కేసు నమోదు చేసినట్లు సమాచారం వస్తున్నది. అయితే పోలీసులు రాకముందే ఓ కీలక నేత అక్కడి నుండి తప్పించుకున్నట్లు సమాచారం వస్తున్నది. ఈ పార్టీలో సుమారు 40 మంది పాల్గొన్నట్టుగా సమాచారం
