ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన ఇంటర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిజామాబాద్ యువకుడు. తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ కొరబడడంతో మరో బాలిక అత్యాచారానికి గురైన సంగతి వెలుగులోకి వచ్చింది. వరంగల్ కు చెందిన ఇంటర్ చదివే ఓ బాలికపై సబిల్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడని పోలీసులు శనివారం ఆయనను అరెస్టు చేశారు. ఈ నెల నాలుగున సభ్యులు వరంగల్ కు వచ్చి ఆ మైనర్ బాలికను నిజామాబాద్ తీసుకెళ్లి రేప్ చేశాడని తెలుస్తున్నది. ఆపై మళ్లీ ఏడవ తారీకు సదరు బాలికను వరంగల్ తీసుకొచ్చి వదిలేసాడని ఇంతేజార్ గుంజ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరికీ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైందని పోలీసులు తెలిపారు.
