తెలంగాణ సామ్నా: తెలుగు సంవత్సరాది సంక్రాంతి పండుగ ఎందో కాని దానికి మరో సెంటిమెంటల్ పేరు పీడ సంక్రాంతి. అంటే సంక్రాంతి వరకు ఎవరు శుభకార్యాలు నిర్వహించకుండా వుంటారు. అందుకే సంక్రాంతిని పీడ సంక్రాంతి అని పిలుస్తారు.
అందేందో గా ఈ పీడ సంక్రాంతి బారాసకు పీడకలల్నే మిగిల్చేటట్టు వుందట. ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావ్ ఫార్మా ఈ కార్ రేసులో ఒకవైపు ఏసిబి మరోవైపు ఈడీ విచారణను ఈ పీడరోజుల్లోనే ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఫార్మా ఈ కార్ రేస్ కేసు లొట్టపీసు కేసు ఇందులో ఏం లేదు అని కేటిఆర్ ఎంత చెప్పినా హైకోర్టు క్వాష్ పిటిషన్‌నే కొట్టేసింది. శిక్ష ఏం వేయలేదు కదా! అన్నంత ధీమాగా కేటిఆర్ మాట్లాడుతున్నాడు కాని హైకోర్టు ఈ కేసు విషయంపై చేసిన వ్యాఖ్యాలు కేటిఆర్ గాని బారాస గాని గమనించడం లేదా? గమనించినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందా? అనే మాటలు జనం నుండి వస్తున్నాయి. హైకోర్టు వ్యాఖ్యాలు కేటిఆర్‌కు పీడకలలు వస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఏసిబి సంగతి ఏలా వున్నా, ఈడీతోటి కేటిఆర్‌కు పీడ తగిలేటట్టు వుందనే చాలా మంది అంటున్నరు. రుపాయి రెండు రుపాయలు కాకపోయే… ఎగ్దమ్ దగ్గర దగ్గర 60 కోట్ల ముచ్చటనాయే. అందులో నోటి మాట జమ ఖర్చు లెక్క గాలిలో పైసలు వేరే దేశంకు ఎగిరిపోతే ఈడీ ఊకుంటదా? పైస పైసకు లెక్క తీసేటట్టు కనిపిత్తుంది.
ఈ రెండిOటితో ఏగలేక కేటిఆర్‌కు పీడరోజులల్లనే కట్టాలు రావాల్నా అని బారాస పెద్దమనుషులు తెగ పరేషాన్ అయితున్నట్లు కనిపిత్తుంది అంట.
కేటిఆర్‌కు పీడ రోజుల బాధ సంక్రాంతి దాటినంక కూడా వుండేటట్టు వుందని తన అభిమానులు బాధ పడుతుంటే, బారసోల్లు మాత్రం చిన్న మనిషి చేసుట్ల ‘‘పెద్ధ మనిషి’’కి పీడ చుట్టుకున్నట్లు అయితుంది అని కొందరు నాయకులు అయితే తెగ బాధ పడుతుండ్రు. మరి ఏం చేద్దాం. పీడ సంక్రాంతి రోజులాయే!
ఏది ఎట్లన్న పోనిగాని హైకోర్టు, సుప్రీంకోర్టు అన్న కొంచెం పీడ తీసేసేట్టు, జిట్టి పోయేటట్టు కొంచె బెయిల్ ఇచ్చిన మంచిగుంటుండే… కనీసం సోపతికి లాయర్‌ను తోలుకపోతే అంటే సరే అని అన్న మంచిగుంటుండే అని కేటిఆర్ అభిమానులు అయితే మస్తు బాధ పడుకుంటు చెబుతుండ్రట. సూడాలా మరి. ఇగ ఈ పీడంతా ఇపుడు కోర్టు తీసే ‘‘దిష్టి’’ మీదనే వుందని చాలా మంది చెబుతున్న ముచ్చట అన్నట్లు.
