27.4 C
Hyderabad
Monday, June 22, 2026
No menu items!

పాకిస్థాన్‌పై ప్రతీకార దాడులు చేస్తున్న అఫ్ఘనిస్థాన్‌ తాలిబన్లు

తెలంగాణ సామ్నా: కొద్ది రోజుల క్రితం అఫ్ఘనిస్థాన్‌పై వైమానిక దాడికి ప్రతీకారంగా అఫ్ఘనిస్థాన్‌కు చెందిన తాలిబన్లు సుమారు 15 వేల మంది పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ప్రతీకార దాడులు చేస్తున్నారు. ఈ మేరకు అఫ్ఘనిస్థాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం ప్రకటన విడుదల చేసింది.
తూర్పు అఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్‌ చేసిన వైమానికి దాడి అఫ్ఘనిస్థాన్‌ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా వుందన్న వాదనల నేపథ్యంలో తమ సత్తా చూపించడానికి అఫ్ఘనిస్థాన్‌ పాకిస్థాన్‌ వైపు కదిలింది. దీనితో రెండు పక్కన వుండే దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న మూడు దేశాల స్థానాల్లో పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌ నిలిచాయి. అసియాలో గత మూడు దశాబ్ధాల కాలంలో పక్కన వుండే దేశాల మధ్యన యుద్ధ వాతావరణం, సైనిక దాడులు జరుపుకున్న దేశాల్లో పాకిస్థాన్‌ అఫ్ఘనిస్థాన్‌ నిలుస్తాయి.
రెండు దేశాల మతం ఒక్కటే. జీవన విధానం ఒక్కటే అయినా ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకునేంత శతృత్వం, వైమానికి దాడులు చేసుకునేంత పగలు ఏంవున్నాయన్న చర్చ ఇపుడు రాజకీయంగా చర్చానీయాంశం అయ్యింది.
గత కొద్ది నెలల క్రితం నుండి పాకిస్థాన్‌లో అనూహ్యంగా చంపబడుతున్న భారత వ్యతిరేక ముస్లిం నాయకుల హత్యల వెనక అఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వ హస్తం వుందని పాకిస్థాన్‌ అనుమానిస్తున్నట్లుగా వినికిడి. సదరు అఫ్ఘనిస్థాన్‌ ఇజ్రాయిల్‌ ముసాద్‌తో కలిసి ఈ అపరేషన్స్‌ నిర్వహిస్తుందని పాకిస్థాన్‌ ఊహిస్తున్నట్లుగా సమాచారం. దీనితో పాటుగా అఫ్ఘనిస్థాన్‌ రహస్య అపరేషన్లు పాకిస్థాన్‌లో పెరిగాయని పాకిస్థాన్‌ అంచనా వేస్తున్నది. తమ కాలు చెప్పు కింద చీమలా పడివుండాల్సిన దేశం, తమకు సామంత దేశంలా బ్రతుకుతుందనుకున్న అఫ్ఘనిస్థాన్‌ ఓ స్వతంత్రదేశంలా వెలగాలని ప్రయత్నం చేస్తుందని పాకిస్థాన్‌ ఆరోపిస్తున్నట్లు వాదన వస్తున్నది.
దీనికి తగినట్లుగా ఈ మధ్య భారత్‌ అఫ్ఘనిస్థాన్‌ దేశాల మధ్యన విపరీతమైన సోదరభావంతో పాటు దౌత్యపరమైన సంబంధాలు మెరుగవడం పాకిస్థాన్‌కు మింగుడు పడడం లేదని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి అంచనాలను నిజం చేస్తున్నట్లుగా పాకిస్థాన్‌ వైమానికి దాడులకు తెగబడడం, అఫ్ఘనిస్థాన్‌ తాలిబన్లను పాకిస్థాన్‌ పైకి పంపడం తో రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం మొదలైనట్లు అయ్యింది. ఈ రెండు దేశాల గొడవలో భారత్‌ పాత్ర ఏంటనే విషయమే ప్రస్తుతం హట్‌ టాపిక్‌గా నిలిచింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles