27.4 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

నాథూరామ్‌ గోడ్సె “వాంగ్ములం”

(నిన్నటి తరువాయి)

  1. మేము ఆప్టే, నేను డిల్లీలో గాంధీజీ ప్రార్థనా సమావేశము వద్ద ఎంత వీలైతే అంత త్వరగా బలమైన, అయితే శాంతియుతంగా ప్రదర్శనను జరిపించుటకు పథకము వేసుకొనినామనియు, అందుకొరకు మేము అక్కడికి పోవలసియుండినదనియు ఇంతకుముందే చెప్పి యున్నాను. 17వ పేరాలో చెప్పిన విధముగా, బాడ్గె కూడా డిల్లీకి వచ్చి ఆ ప్రదర్శనలో పాల్గొనుటకు తన సంసిద్దతను తెలిపినాడు. ప్రదర్శనను విజయవంతముగ నిర్వహించుటకు కొంతమంది వాలంటీర్లను కూడా తీసుకొని పోవుట అత్యవసరమైన విషతయముగా మేము భావించినాము. మేము డిల్లీకి బయలుదేరుటకు ముందు, ప్రదర్శన నిర్వహించుటకు, వాలంటీర్లకు, ఆగు ఖర్చులకుగా విరాళములు వసూలు చేయసాగినాము.
  2. 1948 జనవరి 17వ తేదీన మేము సావర్కరును చూచినా మనుటను, సావర్కరు ‘‘యషశ్వీ హోయా’’ విజయముతో తిరిగి రండు అను మాటలతో మమ్ము ఆశీర్వదించినాడనుటను నేను గట్టిగా కాదనుచున్నాను. అదే విధముగా, మేమే బాడ్గెతో ఏదైనా సంభాషణ గావించినమనుటను, లేక ఆప్టేగాని నేను గాని ‘‘తాత్యారావాణి, ఆప్టే భవిష్య కేలే ఆహెకి గాంధీజీ చిషాంభార వర్ష భారాలి ఆత ఆసలేకామ్‌ నిశ్చిత హోనార్‌యాట్‌ కాహిప సంశయనాహి’ అనే మాటలను ఉచ్చరించినా మనుటకుగాని నిరాకరించుచున్నాను. 1948 జనవరి 15 తేదీన దాదరులో హిందూ సభ కార్యాలయము వద్ద బాడ్గెని కలుసుకొనిన తర్వాత ఆప్టే నేను మా ముద్రణాలయమునకు సంబంధించిన వ్యాపార వ్యవహార నిమిత్తమై పోయినాము.
  3. ఆప్టె, నేను 1948 జనవరి 17వ తేదీన విమానములో డిల్లీకి వచ్చి మెరీనా హోటలులో దిగినాము. 1948 జనవరి 20 తేదీ ఉదయం బాడ్గె హోటలుకు వచ్చి తాను తన సేవకుడు శంకర కిష్టయ్య ప్రదర్వన చేయదలచిన స్థలమునకు పోదలచితిమని నా సమక్షములో ఆప్టెకి చెప్పినాడు. ఆ ఉదయం బాడ్గె వచ్చినపుడు నేను తీవ్రమైన తలనొప్పితో పక్కమీద పండుకొనియుండి, అస్వస్థతగా యున్నందున ప్రార్థనా ప్రదేశమునకు నేను రాలేక పోవచ్చని బాడ్గెకు చెప్పినాను. ఆప్టె, గోపాల్‌గోడ్సె,కార్కరే, మదన్‌లాల్‌ బాడ్గె, అతని సేవకుడు శంకర్‌, వీరందరు మరీనా హోటలులో కలుసుకొనినారనియు, శంకర్‌ బాడ్గ అచ్చటనే భోజనము చేసినారనియు, గోపాల్‌గోడ్సె రివాల్వరును రిపేరు చేయుచుండగా చూచానాననియు, ఆప్టె, కార్కారే, మదన్‌లాల్‌, బాడ్గె స్నానపు గదిలోనికి పోయి గన్‌కాటన్‌ స్లాబుకు, చేతి గ్రెనేడ్‌కు డిలోనేటర్లు, ప్యూజ్‌వైర్లు, ప్రైమర్లు ఏర్పాటు చేయుచుండిరనియు, నేను, శంకర్‌ ఆ గది ద్వారమునకు ఇరవైపుల నిలుచుకొని యుంటిమనియు బాడ్గె ఇచ్చిన వాజ్ఞులము పూర్తిగా అసత్యమైయున్నది.
  4. ‘‘బాడ్గె, ఇది మన అంతిమయత్నం పనిని సాధించితీరాలి, ప్రనతి ఒక్కదానికి సక్రమముగ ఏర్పాటు జరుగునట్టు చూడు’’ అని నా నోట మాటలుగా బాడ్గె చెప్పినాడు. ఆ మాటలను గాని అదే విధమైన వేరు మాటలను గాని ఆ రో జునగాని మరియొక రోజున గాని నేను బాడ్గెలో అనినానను ఆరోపణను నేనుతిరస్కరించుచున్నాను. ముందు చెప్పిన విధముగ బాడ్గె ఉదయము నా గదికి వచ్చి ఆ సాంయంత్రము ప్రార్థనా సమావేశమునకు పోయేదనని నా గదిలో సమావేశము జరిగియుండలేదు. నాకు తెలిసినంత వరకు గోపాల్‌గోడ్సె ఆ రోజున డిల్లీలో ఉండి యుండలేదు. గన్‌కాటన్‌ స్లాబ్‌లకు, చేతి గ్రెనెడ్లకు, డిలోనేటర్లకు ప్యూస్‌వైర్లకను లేక ప్రైమర్లను ఆ గదిలో ఎవ్వరు ఏర్పానటు చేసి యుండలేదు. నిజమునకు నా వద్ద గాని ఆప్టె వద్ద గాని అటువంటి ప్రేలుడు పదార్థములు ఉండనేలేదు. బాడ్గె అంత్యంత వివరముగ వర్థించిన మాతో చేరిన వారికి ఆయుధములు మందుగుండు సామాగ్రి పంపకము, మారుపేర్లు విహించుట, సర్వాబద్దములు. ఈ సాక్ష్యమును మరింత చర్చించి వాంగ్ములంలోని అసత్యమును నిరూపించుట మా న్యాయవాది తన వాదన సమయంలో చేయబోవుచున్నాడు. కాబట్ట ఆ పనిని నేను చేయనవసరంలేదు.
  5. (తరువాయి భాగం రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles