28.6 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

డిఎంకే ప్రభుత్వ అసమర్థలకు నిరసనగా కొరడాదెబ్బలు కొట్టుక్ను అన్నామలై

తెలంగాణ సామ్నా: దేశారాజకీయ చరిత్రలో ఇంతవరకు ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాని ప్రజాప్రతనిధి కాని తెలపలేని రీతిలో తమిళనాడు రాష్ట్ర బీజేపి అన్నామలై తన నిరసనను తెలిపి దేశాన్ని ఆశ్చర్యపరుస్తూనే డిఎంకే ప్రభుత్వ అసమర్థతను ప్రపంచం ముందు వుంచాడు.
తమిళనాడు లోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఓ విద్యార్థిపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రభుత్వ తీరను ఎండగడుతూ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తనకు తానుగా ఆరు సార్లు కొరడాతో కొట్టుకున్నాడు. అలాగే 46 రోజుల పాటు వ్రతం ఆచరించి మురుగన్‌ దేవాలయానికి వెళ్లి రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అన్యాయాల్ని, వేధింపులు, అత్యాచారాల గురించి స్వామి వారిని నివేదించనున్నుట్లు తెలిపారు.
అలాగే రాష్ట్రంలో డిఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకు తాను పాదరక్షలు ధరించనని ప్రతిజ్ఞ చేశారు. అన్నామలై తెలిపిన ఈ విన్నూత్న రీతి నిరసన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిఎంకే ప్రభుత్వ అసమర్థతతను ఎలుగెత్తి చాటుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles