(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
రాయికల్ మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న జన సురక్షా భీమా పథకాలపై ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ బ్యాంకు రాయికల్ శాఖ మేనేజర్ నరేష్ ఆర్బిఐ–ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేనేజర్ నరేష్ మాట్లాడుతూ, 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజనలకు అర్హులని తెలిపారు. అలాగే ఆటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన, జన్ ధన్ ఖాతాలపై అవగాహన కల్పించారు.
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్, మెసేజీలు, లింకులకు స్పందించవద్దని, మోసాలకు గురైన వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీనుగు రాజగంగు అంజయ్య, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, బ్యాంకు సిబ్బంది, సిఎఫ్ఎల్ కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
(దేశభక్తి, దైవ భక్తి, సమకాలీన రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి రిపోర్టర్లుగా స్వాగతం.)
సంప్రదించండి:
“బాలె అజయ్” – 9290277727
