తెలంగాణ సామ్నా డెస్క్: కాళ్లు బండలుగా మారిన మనిషి కాళ్ల కింద గరుకు బండలు వుంటే ఏంటి? పూలు వుంటే ఏంటి? వాటిపై నడిస్తే ఆ వ్యక్తికి బండల గరుకుతనం తెలియదు పూల మెత్తదనం కూడా తెలియదు. ఈ అమ్మ జీవితం లాగానే. జీవితమంటే తన కుటుంబమే అనుకొని జీవించింది ఆ అమ్మ. అంతేకాదు. తనకు మిగిలివున్న ఎకైక ఆశగా తన కొడుకును గొప్పవాడు కావాలని కోరుకుంది ఆ అమ్మ. తన పంచప్ర్రాణాలు కొడుకే అనుకొని తపించింది. దేవుడు చాలా గొప్పవాడు. తల్లి ఆశను, చేసిన పూజల్ని మన్నించి ఆ కొడుకును ప్రయోజకున్ని చేశాడు. కాని అదే దేవుడు పెద్ద ఎగ్జామినర్ కదా..! ఆ తల్లి జీవితానికి పరీక్ష పెట్టాడు.
ఆ తల్లి వయసు సుమారు 68 సంవత్సరాలు వుంటాయి. ఆమె భర్త చనిపోయి సుమారు 35 సంవత్సరాలు గడుస్తుందేమో! ఎక్కడో అడవులు ఎక్కువగా వుండే ప్రాంతం నుండి ఆ తల్లి సుమారు 55 సంవత్సరాల క్రితం ఓ తన మేనబావను పెళ్లి చేసుకొని ఓ పట్టణానికి కోడలుగా వచ్చింది. అప్పుడు వుండే వారి కుటుంబ పద్ధతులు, కుల పద్ధతుల కారణంగా ఆ తల్లి గడప దాటి బయటకు వచ్చేది కాదు. ఆమె భర్త ఒక సినిమా టాకీస్‌లో పనిచేసేడివాడు. పూర్తిగా గ్రామీణ ఆపంతం నుండి వచ్చిన కొత్త కోడలు కావడంతో ఆమెకు పట్టణపు అలవాట్లు కాస్త చిత్రంగా కనిపించేడివి. అందులోను సినిమాలు తప్ప మరే వినోదం లేని కాలంలో వచ్చిన సినిమా వదలకుండా ఉచితంగా చూసే అవకాశం మాత్రం ఆమెకు లభించేడిది.
ఎక్కువగా లోకజ్ఞానం తెలియని వయసు కావడంతో పాటుగా కాస్త అమాయకత్వం ఆమెలో కనిపించేడిది. భర్త సినిమా టాకీస్‌లో ఉదయం
నుండి రాత్రి 12 గంటల వరకు పనిచేసేడివాడు. పొస్టర్లు అంటించడం, మైకులో సినిమా గురించి ప్రచారం చేయడం, టికెట్లు ఇవ్వడం కూడ జరిగేది. ఈ క్రమంలోనే ఆమె భర్తకు మెల్లిమెల్లిగా మందు తాగడం, బీడీలు కాల్చడం అలవాటైంది. అలా ఆమె భర్త చాలా చిన్న వయసులోనే అన్ని రకాల దురలవాట్లకు బానిసైపోయాడు. భర్త పరిస్థితిని చూసి వారించే స్థితిలో ఆమె లేదు. అంటే లేదని కాదు. భర్త ఏం చేసినా ఎదురు చెప్పకూడదనే అని తల్లిదండ్రులు చెప్పిన జ్ఞానం మాత్రమే వుంది ఆమె వద్ద.
భర్త కుటుంబాన్ని మరిచి కేవలం త్రాగడానికి డబ్బులు అవసరం కాబట్టి పనికి పోవడం లేకపోతే ఎలాగోలా చేసి తాగి వచ్చి భార్యను తిట్టడం అతని దినచర్యగా మారాయి. ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయ్యింది. పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయింది. బంధువులందరు ఏడ్చారు. మందు మత్తులో వున్న భర్త తప్ప. అతనికి బాధ ఎప్పుడు వుంటది అంటే, ఫస్ట్ షో ప్రారంభం అయ్యేకంటే ముందు ఆటాణా పైసల నల్లగల్లు కడుపులో పడకపోతే బాధ పడతాడు కాని కడుపులో వున్న బిడ్డ చనిపోతే బాధపడతాడా? అని బంధువులు, పరిచయస్థులు మొఖం మీదే తిట్టినా పట్టించుకొని మహనుభావుడి మహనుభావుడికి అమాయకుడికి ఇల్లాలు ఆ తల్లి.
భర్త తాగుడు అలవాటుతో అంతంత మాత్రంగా వున్న కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది. పొయ్యిలో నుండి పిల్లి లేవలేని పరిస్థితి ఎర్పడిరది. ముందు వెనకా ఆస్థులు లేవు. ఆదుకోవడానికి తల్లిగారింటి దగ్గర ఏమీ లేదు. అత్తారింటిలో ఎవరు ఎక్కడ వుంటారో తెలియదు. వారి బంధువుల అందరి పరిస్థితి పొట్ట చేత పట్టుకొని పరాయి గ్రామాలకు, రాష్ట్రాలకు వలస వెళ్ళిన వారే. దాంతో ఇంట్లోని కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేక ఒక్కొసారి పస్తులు వుండే పరిస్థితి ఆ తల్లికి వచ్చేది. ఆ దుర్భర పరిస్థితులతోనే పది సంవత్సరాలు గడిచాయి. ఆమె భర్తకు సుమారు 30 సంవత్సరాలు వచ్చాయి. కాని ఎవరు చూసినా 50 ఎళ్ల మనిషిలాగే కనిపించేత అచేతనుడుగా తయారయ్యాడు. భర్త ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం ప్రారంబమయ్యింది. ఈ క్రమంలోనే ఆమె మళ్లీ గర్భం దాల్చింది.
జీవితమంటే ఉచితంగా చూసే కాదని ఆమెకు మెల్లిమెల్లిగా ఆర్థం అవుతోంది. కొద్దొగొప్పొ మాటకో, మర్యాదకో వున్నారనుకున్న అత్తామామలు చనిపోయాకా ఆమెకు కష్టాలు మరింతగా పెరిగాయి. కష్టాలు మెల్లిమెల్లిగా బాధ్యతలు నెర్పాయి. కళ్లముందు కనిపిస్తున్న భర్తను, కడుపులో వున్న బిడ్డను బ్రతికించుకోవడానికి ఎదో ఒక పని చేయాలని నిశ్చయించుకుంది. అప్పటి వరకు తన కుటుంబ పరిస్థితి చూసి లోలోపల బాధ పడ్డ గల్లీ లో వుండే మహిళలు కొందరు బీడీలు చుట్టడం నేర్పించారు. గర్బంలో వుంటూనే పావుసేరు, పాంచ్‌సౌ బీడీలు వొడిదికి చుట్టేది. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఇంటినుండి తిని పోయాడు అంటే ఎక్కడ తాగుతాడు, ఎలా తాగుతాడు, ఎంత తాగుతాడు అనే లెక్కలేని ఆ భర్తకు ఒ రోగం వచ్చి పడిoది. టిబి రోగం. ఈ క్రమంలోనే ఆమె కొడుకుకు జన్మనిచ్చింది. కోడలుగా ఆ ఇంటికి వచ్చినాకా ఎన్ని సార్లు సంబరపడిరదో తెలియదు కాని కొడుకును చూసి మురిసిపోయింది ఆ తల్లి. పుట్టిన కొడుకుకు పేరు పెట్టక ముందే భరించలేని దుర్వార్త వినాల్సివచ్చింది. ఆమె భర్త అనారోగ్యంతో మరణించాడు. అంతవరకు అంతో ఇంతో వున్నాడు అనుకున్న భర్త కూడా లేకపోవడంతో ఆ తల్లి ఒంటరిది అయ్యింది . పస్తుతం ప్రపంచజ్ఞానం తెలియని ఇద్దరు ఒకే ఇంట్లో వుండే పరిస్థిఇ వచ్చింది. ఒకరు తల్లి. ఇంకొకరు నెలలు కూడా నిండని పసిగుడ్డు.
(తరువాయి బాగం రేపు)

