తెలంగాణ సామ్నా: పుష్ప2 సినిమా హిట్ సంగతి పక్కన బెడితే ఆ సినిమా ప్రివ్యూ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన తరువాత వచ్చిన కేసుతో అల్లు అర్జున్ ఇరకాటంలో పడినట్లే చెబుతున్నారు. ఇది మరో సస్పెన్స్ థిల్లర్ సినిమాలాగే వుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఓయూ జేఏసి ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిరచారు. రాళ్లదాడి చేశారు. మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. తరువాత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ధర్నా జరుగుతున్న సమయంలో ఇంట్లో ఎవరు లేకున్నా ఇంటిపై దాడి తాజాగా మరో సంచలనం అయ్యింది. ఇప్పటికే అల్లు వీడియోలు నెగిటివ్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజా దాడి వారికి మరో ఇబ్బందిగా తయారయ్యింది.
