
తెలంగాణ సామ్నా: రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవలానే ఉద్దేశ్యంతో శక్తికి మించిన హమీలనిచ్చి ఆప్ కన్వీనర్, డిల్లీ మాజీ ముఖ్యమంత్రి ప్రజల ముందు చులకన అవుతున్నారు. మొన్నటికి మొన్న వృద్దులకు ఉచిత వైద్యం అంటూ ప్రకటించి తమ ప్రభుత్వం వచ్చాకా అమలు చేస్తామని చెప్పాడు. కాని వృద్దులకు సంబంధించిన జాబితాను తమ కార్యకర్తలు ఇళ్లిల్లు తిరిగి సేకరిస్తారని ప్రకటించాడు. ‘‘పిల్ల పుడుతుందో లేదో తెలియదు కాని ముందే కుల్ల కుట్టిచ్చి పెట్టినట్లు’’ కేజ్రీవాల్ వ్యవహరం వుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
అది అలా వుండగానే తాజాగా మళ్లీ అధికారంలోకి రాగానే గుడుల్లోని పుజారులకు, గురుద్వారాలో వున్న గ్రంథీలకు నెలకు 18, 000లు ఇస్తామని హామి ఇచ్చాడు. ఒకవైపు దాదాఉగా 18 నెలల నుండి ఇమామ్‌లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో డిల్లీ ప్రభుత్వం తాజాగా పుజారులకు, ఇమామ్‌లకు జీతాలు ఇస్తామని ప్రకటించడంతో కేజ్రీవాల్‌కు అన్ని వైపులా నుండి విమర్శలు వస్తున్నాయి. దాదాపుగా 8 నెలల నుండి ఇమామ్‌లు తమ జీతాల కోసం ఉద్యమాలు చేస్తుంటే అవేవి పట్టనట్లు, ప్రజలకు ఏమీ తెలియదన్నట్లు తాజాగా చేస్తున్న హామీలతో ఆప్ ప్రజల్లో మరింత చులకన అవుతుందన్న వాదనలు వస్తున్నాయి.
ఒకవైపు హమీలతో డిల్లీ ప్రజల్ని మభ్య పెడుతూనే పంజాబ్‌లో రైతులను రెచ్చగొట్టి బీజేపి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడన్న వాదనలు కూడా వస్తున్నాయి.
