24.1 C
Hyderabad
Friday, July 31, 2026
No menu items!

నేరారోపణ పత్రమునకు ప్రతివచనము

ప్రథమ భాగము

(నిన్నటి తరువాయి)


‘‘నాథూరామ్‌ వినాయక గోడ్సె అను నేను ఈ క్రింది విధముగ మనవి చేసుకొనుచున్నాను’’

  1. 1. నాపై ఆరోపించబడిన వివిధ నేరములను గూర్చి మనవి చేసుకొనుటకు ముందు అసలు నేరారోపణమే న్యాయశాస్త్ర బద్దబముగ చేయబడలేదని గౌరవ పూర్వకముగ నివేదించుకొనుచున్నాను. ఆరోపణ పత్రములో ఒకదానికొకటి సంబంధములేని ఆరోపణలను న్యాయశాస్త్ర పద్దతికి విరుద్ధముగ అసంబద్దముగ జోడిరచినారు. నిజునకు 1949 జనవరి 20వ తేదీ జరిగినదనుబడు సంఘటన, 1949 జనవరి 30తేదీ జరిగినదనబడు నేరము వేరువేరుగా విచారణ చేయబడవలసి యున్నవి. ఆ రెండిరటిని కలిపి, ఒకే విచారణ పరిధిలోనిక ఇతెచ్చుటచే మొత్తము విచారణ చట్టవిరుద్ధమై పోయినది.
  2. 2. పైన నేను నివేదించిన దానికి భంగము లేకుండా, నాపైఊ ఆరోపించబడిన వివిధ నేరముల విషయమై క్రింది విధముగ నివేదించుకొనుచున్నాను.
  3. 3. నిందితులకు వ్యతిరేకముగ సమర్పించబడిన నేరారోపణ పత్రములో అనేక అంశములు చెప్పబడినవి. ప్రతియొక్క నిందితుడు, వ్యక్తిగతముగ, సమిష్టిగా భారత శిక్షాస్మృతి మరియ ఇతర చట్టముల ప్రకారం శిక్షింపదగిన నేరములను చేసినట్టు ఆరోపించబడినది.

4. ఆరోపణ పత్రమును చూడగా, 1948 జనవరి 20వ తేదీ, మరియు దాని తర్వాత 1948 జనవరి 30వ తేది సంభవించిన సంఘటనలను గాంధీజీ హత్యయే లక్ష్యముగా గల ఒకే కార్యముగ లేక ఒకదాని కొకటి అనుబంధముగ జరిగిన గొలుసుకట్టు సంఘటనలుగా నేరారోపకులు భావించినట్లు కనబడుతున్నది. అందువలన 1948 జనవరి 20 వ తేదీ వరకు జరిగిన సంఘటనలు స్వతంత్రమైనవియు, ఆ తర్వాత మరియు 1948 జనవరి 30 తేది జిరగిన సంఘలనలతో వాటికి ఏలాంటి సంబంధము లేదనియు ప్రప్రధముగ నేను స్పష్టము చేయదలచుకొన్నాను.

  1. 5. నేరారోపణ పత్రములోని ఆరోపణలలో గాంధీజీని హత్య చేయుటకు నిందితులందరు కలసి కుట్ర చేసినారు అనునది మిగత అన్నికన్న అత్యంత ప్రముఖమైన ఆరోపణగా నున్నది. అందువలన దానిని గూర్చి మొదట చెప్పదలచినాను. నేరారోపణ పత్రములో పెర్కోనబడిన నేరమలులలో ఏ ఒక్కదానిని చేయుటకు నిందితులందరు కలసి కుట్రచేసి యుండలేదని నేను చెప్పుచున్నాను. అంతేకాదు. ఆర్పోఇంచబడిన నేరములు చేయుటకు ఇతర నిందితులతో నేను కలసి వారికి సహకరించి యుందలేదని కూడా ఖచ్చితంగా చెప్పుచున్నాను.

(తరువాయి బాగం రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles