33 C
Hyderabad
Saturday, October 31, 2026
No menu items!

కోరుట్ల బీజేపీ అధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

(బాలే అజయ్ – 9290277727 | కోరుట్ల)

భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బాలాజీ రోడ్ రామ్‌నగర్‌ చౌరస్తాలో గల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కస్తూరి లక్ష్మీనారాయణ మాడవేడి నరేష్ మాట్లాడుతూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు పటేల్ అని కొనియాడారు. ఆయన జీవితం నేటి తరానికి దేశభక్తి, కర్తవ్యనిష్ఠ, ఐక్యతకు గొప్ప స్ఫూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎర్ర రాజేందర్ ,చెట్లపల్లి సాగర్, మ్యకల గణేష్, ఉపాధ్యక్షులు మైదం సత్యనారాయణ, తాళ్ల పెళ్లి శ్రీనివాస్, గోనెల రాజశేఖర్ కార్యదర్శులు బాల్క ప్రేమ్ సాగర్, చిట్యాల రాజేంద్ర కుమార్, నారవేణి విజయ్, ఒళ్ళుజి నాగేష్, రాధారావు సత్యనారాయణ, ఉప్పులూటి రాఘవులు, గోనే రాజారాం సీనియర్ నాయకులు సాడిగే మహేష్, బీజేవైఎం అధ్యక్షులు దమ్మ సంతోష్ రెడ్డి, దళిత మోర్చా అధ్యక్షులు బెక్కం అశోక్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మామిడి మల్లేష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా మీడియా కోకన్వీనర్ దామా శ్రావణ్ కుమార్ బిజెపి, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles