
ఈ ఫార్మా కార్ రేసులో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 60 కోట్ల రుపాయలు విదేశీ కంపనీకి తరలించబడ్డాయన్న విషయంపై ఈడీ రెండవ తేదీ నుండి ప్రత్యక్షంగా తన విధులను నిర్వర్తించలసి యున్నది. కాని రెండవ తారీఖున ఈడీ ముందు హజరుకావలసిన బిఎల్‌ఎన్ రెడ్డి మరోసారి హజరు అవుతానని ఈ రోజు ఈడీకి తెలిపినాడు. ఇందుకు ఈడీ కూడా అంగీకరించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ ఈ నెల 8 మరియు 9 వ తేదీల్లో తమ ముందు తప్పకుండా హజరుకావాలని బిఎల్‌ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్‌లకు స్పష్టం చేసింది. అంతకు ముందు ఒకరోజు ముందు 7వ తేదీన కేటిఆర్ ఈడీ ముందు హజరుకావాల్సి వుంది.
ఇంకా ఈడీ ముందు హజరుకావడానికి ఐదురోజుల సమయం వున్న నేపథ్యంలో ముగ్గురిలో ఒకరు కోర్టును ఆశ్రయించే అవకాశాలు వున్నాయన్న విశ్లేషణలు వస్తున్నాయి.
