
తెలంగాణ సామ్న: అల్లు అర్జున్‌కు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జాతీయ అవార్డు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎమ్మేల్సీ తీన్యార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఒక స్మగ్లర్ హీరోగా నటించి సమాజానికి చెడు సందేశం ఇస్తున్న సినిమాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఏమటని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్లను ప్రొత్సాహించి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసిన డైరెక్టర్ సుకుమార్‌పై కేసుపెట్టి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
