(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ ఆధ్వర్యంలో బుధవారం కోరుట్ల పట్టణంలోని గడి బురుజుల వద్ద గడి మైసమ్మ తల్లికి నీడ గుడిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గడి మైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కోరుట్ల పట్టణానికి చెందిన వివిధ కుల సంఘాల ప్రతినిధులు, జగిత్యాల జిల్లా బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ ప్రతినిధులు, కోరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
గడి మైసమ్మ తల్లికి నీడ గుడి ఏర్పాటు చేయడం పట్ల పాల్గొన్న వారు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం భవిష్యత్తులో కూడా అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని వారు ఆకాంక్షించారు.
