(బాలే అజయ్ – 9290277727, జగిత్యాల)
లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో, పద్మశాలి సేవా సంఘం జగిత్యాల వారి సహకారంతో రేకుర్తి కంటి వైద్యశాల ద్వారా గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో మొత్తం 85 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 52 మందికి కంటి ఆపరేషన్ అవసరమని వైద్యులు గుర్తించారు. దీంతో డాక్టర్ భాస్కర్ మాడేకర్, లయన్స్ క్లబ్ సభ్యుడు చిదుర సురేష్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి వైద్యశాలకు చెందిన లయన్స్ ఉచిత బస్సు ద్వారా బాధితులను కరీంనగర్‌కు తరలించారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుండేటి గంగాధర్, కార్యదర్శి అడువల జ్యోతి, ట్రెజరర్ పోతు గణేష్, తాటిపాముల వినోద్ కుమార్, వడ్లగట్ట శంకర్, శ్రీరాముల సుదర్శన్ పాల్గొన్నారు. అలాగే లయన్స్ క్లబ్ సభ్యులు మనపూరి శ్రీనివాస్, చిలుక రాజన్న, చిలివేరి రాజ్‌కుమార్, సామల శ్రీహరి, అనుమల్ల విలాస్, బత్తుల ప్రదీప్, ధోపాటి దేవదాస్, బుర్ర కిరణ్‌తో పాటు పద్మశాలి సేవా సంఘం పాలకవర్గ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
