(బాలే అజయ్, కోరుట్ల)

కోరుట్ల పట్టణంలో శుక్రవారం మండల స్తాయి బూతు లెవెల్ అధికారులకు బూతు లెవెల్ ఏజెంట్లకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కోరుట్ల ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చడంతో పాటుగా అనర్హులను జాబితాలో నుండి తొలగించడానికి జూన్ 25 నుండి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 25 నుండి జూలై 24 వ తారీకు వరకు బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్నుమరేషన్ ఫారం ను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ఓటర్లకు సంబంధించిన వివరాలను నింపుటకు సహాయం చేసి ఎన్నుమరేషన్ ఫారం తీసుకుంటారు అని ఆయన తెలిపారు.
ఫారం లో పాత ఫోటో ప్రస్తుత ఫోటో జత చేసి పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ తల్లిదండ్రుల వివరాలు మరియు భాగస్వామి యొక్క వివరాలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
గతంలో 2002లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ జాబితాలోని మీ తల్లిదండ్రుల లేదా తాతల యొక్క వివరాలను ఎన్నుమరేషన్ ఫారంలో నింపవలసి ఉంటుంది అని ఆయన తెలిపారు.
సర్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనేలా బిఎల్వోలు, బిఎల్ఏలు కృషి చేయాలని ఈఆర్ఓ జీవాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి మరియు తహసిల్దార్ కృష్ణ చైతన్య, రెవెన్యూ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
