34 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

(బాలే అజయ్, కోరుట్ల)

తెలంగాణ రాష్ట్రంలోని స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుట్ల పట్టణ స్వర్ణకారుల సంఘం శనివారం రెవిన్యూ డివిజనల్ అధికారికి, కోరుట్ల తాసిల్దారుకి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు ఇందూరి ప్రసాద్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీరాముల శ్రీకాంత్ మాట్లాడుతూ స్వర్ణకారుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకమండలిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే జీవో నెంబర్ 272 ను సవరణ చేసి మరింత పటిష్టంగా తయారు చేసి దొంగ బంగారం రికవరీ కేసులో స్వర్ణకారులపై కేసులు లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు.
అలాగే 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకార వృత్తిదారులకు ప్రతినెల గీత కార్మికులకు చెల్లిస్తున్నట్టుగా పెన్షన్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తమ వినతుల్ని డిమాండ్లను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత తొందరలో స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పబ్బోజీ లక్ష్మీనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మండలోజీ రవీందర్ లతో పాటు బెజ్జారపు శ్రీనివాస్, అక్కినపల్లి వేణు, లతో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles