23.8 C
Hyderabad
Tuesday, November 3, 2026
No menu items!

వైభవంగా దుంపేట లక్ష్మి నరసింహ స్వామి జాతర

(అల్లే సంతోష్, కథలాపూర్)

దుంపేట గ్రామంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి జాతర శుక్రవారం రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ జాతరకు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
స్వయంభు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం జాతర సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోగా, ఎక్కడ చూసినా భక్తి నినాదాలు మార్మోగాయి.
జాతరలో భాగంగా నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. భక్తులు ఆనందంగా ప్రసాదాన్ని స్వీకరించారు.
ఇక శనివారం తెల్లవారుజామున జరిగే రథోత్సవం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. “జై లక్ష్మి నరసింహ స్వామి” నినాదాలతో భక్తులు రథాన్ని లాగుతూ భక్తి పరవశంలో మునిగిపోతారని గ్రామస్తులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్యాల రమేష్ గౌడ్, ఉప సర్పంచ్, విడిసి సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles