(అల్లే సంతోష్, తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో అంగన్వాడీ ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల అభివృద్ధి కార్డులను గ్రామ సర్పంచ్ నాగం భూమయ్య తల్లులకు అందజేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి సూపర్వైజర్ స్రవంతి మాట్లాడుతూ, పుస్తకాధారిత విద్యతో మాత్రమే పిల్లల సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటలు, పాటలు, కథల ద్వారా పిల్లలకు మంచి అలవాట్లు నేర్పిస్తూ, పోషకాహారం అందిస్తూ సమగ్ర విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు అంగన్వాడీ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
పోషణ పక్షవాడ కార్యక్రమంలో భాగంగా సీమంతం, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లింబాద్రి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు అమృత, యశోద, స్వరూప, సంధ్య, తల్లులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
