(బాలే అజయ్, 9290277727)
మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి బుధవారం సాయంత్రం కోరుట్లలోని ఆయన స్వగృహానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చిననాటి మిత్రులు, బంధువులు ఆయనను కలిసారు.
బంధువులను కలిసిన తిరుపతి బావోద్వేగానికి లోనయ్యాడు.
ఈ సందర్భంగా ఎర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను జనజీవన స్రవంతిలో కలిసిన తరువాత మొదటిసారిగా సొంత ఇంటికి రావడం జరిగినదని తెలిపాడు. తాను ఉద్యమబాటలో వెళ్లినాకా తిరిగి మళ్లీ సొంత ఇంటికి వస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నాడు. తనను కలవడానికి చిననాటి మిత్రులు బంధువులు రావడం సంతోషంగా వుందని తెలిపాడు.
ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను చెప్పాలని అనుకున్నది గతంలోనే పాత్రికేయ సమావేశంలో తెలిపానని అన్నారు. ప్రస్తుతం తాను తన బంధుమిత్రులను, చిననాటి స్నేహితులను కలవడానికి వచ్చానని అన్నాడు.
ఇకపై తన వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా ప్రజాజీవితంలో వుంటానని తెలిపాడు.

