
(బాలే అజయ్, తెలంగాణ్ సామ్నా, కోరుట్ల)
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కోరుట్ల నగర ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ వడ్లకొండ గంగాధర్ గారు ఆయనకి ఆర్ఎస్ఎస్ తో ఉన్నటువంటి అనుభవాన్ని స్వయంసేవకులతో పంచుకున్నారు. ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి సామల కిరణ్ గారు మాట్లాడుతూ ప్రకృతిలో సంభవించే మార్పులతో ఉగాది పండుగ వస్తుంది, ఉగాది పండుగ యుగానికి ఆదిలాంటిదని, ఈ ఉగాది రోజునే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరాంపంత్ హెడ్గేవార్ జన్మించారని పేర్కొన్నారు. డాక్టర్ హెడ్గేవార్ గారి మనసు బాల్యం నుండి దేశభక్తితో నిండి ఉండేదని, బ్రిటిష్ వారి పట్ల తన వైఖరిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించేవాడని దానికి ఉదాహరణగా విక్టోరియా పట్టాభిషేక సంబరాలలో తనకిచ్చినటువంటి మిఠాయిని కాలువలో పడవేయడం బ్రిటిష్ అధికారి తాను చదువుకునే పాఠశాలకు వచ్చినప్పుడు వారికి వ్యతిరేకంగా వందేమాతరం అనే నినాదాన్ని ఇవ్వడం, అదేవిధంగా కలకత్తాకి వెళ్లి అక్కడ అనుశీలన సమితిలో సభ్యులుగా చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పని చేశారన్నారు. భారతదేశానికి సిద్ధించినటువంటి స్వాతంత్రం దేశ ప్రజలలో ఉన్నటువంటి అనైక్యత వల్ల ఎక్కడ మళ్ళీ దూరమవుతుందోనని డాక్టర్ జి దేశ ప్రజలందరినీ సంఘటిత పరచాలని ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ని ప్రారంభించారన్నారు. ఈ RSS శాఖ అనే ఒక చిన్న మాధ్యమం ద్వారా వ్యక్తిని నిర్మాణం చేస్తుందని వ్యక్తి నిర్మాణం ద్వారా దేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకువెళ్లాలని లక్ష్యంతో పనిచేస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో విభాగ వ్యవస్థ ప్రముఖ్ రాజ్యాగంగాధర్, జిల్లా సహా వ్యవస్థా ప్రముఖ్ శివకుమార్, నగర కార్యవాహ ప్రవీణ్, వేణు, అనిల్, రాజకుమార్,రవి, రంజిత్,శేఖర్,గంగాధర్, సృజన్, మహేష్,కృష్ణమోహన్ ఇతర స్వయం సేవకులు పాల్గొన్నారు.

