(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలోని 23వ వార్డు నుండి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన దివ్యాంగుడు చెట్టిపెల్లి ఓం ప్రకాష్‌ను దివ్యాంగుల కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఎన్నికల బరిలో నిలిచి ప్రజా సేవా సంకల్పంతో ముందుకు వచ్చిన ఓం ప్రకాష్ ఈసారి విజయం సాధించకపోయినా, దివ్యాంగుడిగా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా సమాజానికి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు. శారీరక అవరోధాలు ఉన్నప్పటికీ ధైర్యసాహసాలతో రాజకీయ రంగంలో అడుగుపెట్టడం ప్రశంసనీయమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దివ్యాంగుల కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో దివ్యాంగుల హక్కులు, అవకాశాల కోసం మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓం ప్రకాష్ లాంటి వారు రాజకీయ రంగంలోకి రావడం ద్వారా ఇతర దివ్యాంగులకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
సన్మాన కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, దివ్యాంగుల సంఘ సభ్యులు పాల్గొని ఓం ప్రకాష్‌ను అభినందించారు. ప్రజాసేవ పట్ల ఆయన చూపించిన తపన భవిష్యత్తులో మరింత ఫలితాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
