(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలలో మండల స్థాయి గణితం మరియు భౌతిక శాస్త్ర స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. కోరుట్ల, కథలాపూర్ మండలాల పరిధిలోని ఉన్నత పాఠశాలల గణితం, ఫిజిక్స్ ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు చె. కృష్ణ మోహన్ రావు, జోస్నా మాట్లాడుతూ… గణితం, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేలా, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అవగాహన కలిగించేలా బోధనా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పదవ తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కంప్యూటర్ లిటరసీపై అవగాహన కలిగి ఉండేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగతంగా చొరవ తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ లక్ష్మీకాంతం, సంతోష్, కె. రాజ్ కుమార్, అలాగే సి.ఆర్.పి.లు పి. గంగాధర్, జ్యోతి, సత్యనారాయణ పాల్గొన్నారు.

