(బాలే అజయ్,తెలంగాణ సామ్నా )
యూట్యూబర్ అన్వేష్ గత కొద్ది రోజుల క్రితం హిందూ దేవి దేవతలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివాదం ముదిరిన నేపథ్యంలో యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్వేష్ కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నోటీసులకు స్పందించకపోతే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ కోసం ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తున్న నేపథ్యంలో అతను చేసిన వివాదాస్పద వీడియోల వివరాల కోసం ఇంస్టాగ్రామ్ కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది.

