35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

మున్సిపల్ ఎన్నికలు–2026కు ముసాయిదా ఓటర్ జాబితాల సిద్ధం

కోరుట్ల, తెలంగాణ సామ్నా, జనవరి 1: కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ సాధారణ ఎన్నికలు–2026 నిమిత్తం, 33 వార్డుల వారిగా ముసాయిదా ఓటర్ జాబితాలు (Draft Electoral Rolls) సిద్ధం చేసినట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు.
ఈ ముసాయిదా ఓటర్ జాబితాలను ప్రజల పరిశీలనార్థం కోరుట్ల ఆర్డీఓ కార్యాలయం, కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం, కోరుట్ల మున్సిపాలిటీ కార్యాలయంలలోని నోటీస్ బోర్డులపై అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ వివరించారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు ఆయా కార్యాలయాలను సందర్శించి తమ పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ జాబితాలో తప్పులు, సవరణలు, చేర్పులు లేదా తొలగింపులు అవసరమైన సందర్భంలో, నిబంధనల ప్రకారం సంబంధిత అభ్యర్థనలను సమర్పించవచ్చని తెలిపారు.
అర్హులైన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటు హక్కును సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ విజ్ఞప్తి చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles