29.1 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం గాంధీహత్య

నిన్నటి తరువాయి

జాతి వ్యతిరేక సంతుషీత్టకరణకు పరాకాష్ఠ
ఏ దినమైతే నేను గాంధీజీని రాజకీయ రంగమునుండి తొలగించవలెనని నిశ్చయించుకొనినానో, అపుక్పడే వ్యక్తిగతంగా నేను, నాది అనుకొనే ప్రతిదానికి దూరమైపోతానని నాకు స్పష్టముగతా తెలుసు. నేను ధనవంతుడను కానీ, మధ్యతరగతి సమాజములో గౌరవ మర్యాదలు గల సాథనములో వుంటూ వుండినాను. ఇంతవరకు నేను చేయగల్గిన సేవలు నా ప్రజలలో నాకు గౌరవ మర్యాదలు గల స్థానమును చేకూర్చినవి. సంస్కృతి, నాగరికతలను గూర్చి భావములు నాకు కొత్త ఏమీ కాదు. నా భావి జీవితములో ఆచరించుటకు నా దృష్టిలో నిర్మాణాత్మక కార్యముల పథకములు కొన్ని కలిగి వుంటిని. వాటిని చేపట్టి విజయవంతముగ నిర్వర్తించుటు తగినశక్తి, ఉత్సాహము నాకు వున్నట్ల నేను భావించినాను. నేను సంపూర్ణ ఆరోగ్యమును కలిగియున్నాను. దేహ సంబంధమైన లోపములు ఏమీ నాకు లేవు. ఏలాంటి దుర్వ్యసనాలకు నేను అలవాటు పడలేదు. నేను స్వయంగా విజ్ఞాన ఖనిని కాకపోయినా, జ్ఞాన సంపన్నుల యెడ నాకు అత్యంత గౌరవము.

192930లో కాంగ్రెసు తన ప్రథమ సహాయ నిరాకరణోద్యమము ప్రారంభించినప్పటి నుండి నేను సమాజసేవ కార్యకర్తగా జీవితములో ప్రవేశించినాను. అప్పటికీ నేను ఒక విద్యార్థిని మాత్రమే. కాని పత్రికలలో ప్రచురించబడిన ఈ ఉద్యమమును గూర్చిన ఉపన్యాసములు వార్తలు నన్ను చాలా ప్రభావితము చేసినవి. అందువలన ఉద్యమములో చేరి ప్రజాహిత కార్యకర్తగా జీవనము సాగించదలచినాను. ఉ ఉద్యమము పూర్తి అగునప్పటికీ, ముస్లింలకు సంబంధించిన సమస్యలు తీవ్రరూపం దాల్చినవి. దీని ఫలితముగా డాక్టర్‌ మూంజే, కొందరు ఆర్యసమాజ నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ కార్యకర్తలు మిందూ సంఘటనకై తీవ్రముగ ప్రయత్నములు చేయసాగినారు. అన్ని రాజకీయ పక్షములలోను ‘‘కమ్యూనల్‌ అవార్డు’’ (మతపరముగ రాజకీయ ఏర్పాట్లపై నిర్ణయము) సమస్య పవేడివేడిగా చర్చిపంబడుతూ వుండినది. ఈ సమయంలో గుర్తింపబడిన సంఘటన1935లో పూణేలో జరిగిన హిందూ మహాసభ సమావేశములో కాంగ్రసు అన్యాయముగ ముస్లింల యెడ పక్షపాత ధోరణి వహించి హిందువులకు హానికరముగ ప్రవర్తించుచుండినందున కాంగ్రెసు వత్యతిరేకముగా హిందూ మహాసభ శాసన సభలలో పోటీ చేయవలెనని నిర్నయించబడినది. కాంగ్రెసు ప్రముఖ నాయకుడుగా కూడా వుండిన స్వర్గీయ పండిత మదనమోహన మాళవీయ ఆధ్వర్యంలో జరిగిన హిందూ మహాసభ సమావేశంలోనే కాంగ్రెసుకు వ్యతిరేకముగ పోటీ చేయవలెననే ఈ తీర్మానము చేయబడినది.

1932 సంవత్సర ప్రాంతములో నాగపూరుకు సంబంధించిన డాక్టరు హెగ్డేవారు మహారాష్ట్రలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభించినారు. ఆయన ప్రసంగాలు నన్ను ఎంతగానో ప్రబావితము చేసినవి. నేను ఆ సంఘ స్వయంసేకుడిగా చేరినాను. మహారాష్ట్రలో దాని ప్రారంభదశలలో సంఘములో చేరిన స్వయంసేవకులలో నేను ఒకడిని. నేను కొంతకాలము పాటు మహారాష్ట్ర ప్రాంతములోని మేధావి వర్గములలో కూడా పని చేసినాను. హిందువుల ఉద్దరణ కొరకు పని చేసినాను కాబట్టి, హిందువుల న్యామైన హక్కుల పరిరక్షణ కొరకు దేశ రాజకీయ కార్యక్రమములో కూడా పాల్గోనడం అవసరమని నేను భావించినాను. అందువలన నేను సంఘమును వదిలి హిందూ మహాసభలో చేరినాను.

(మిగితా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles